Anantapur District: హిందూపురం జైలులో ఉరివేసుకుని ఖైదీ ఆత్మహత్య
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8dc2b2be1e3c590a73884e72bcf0aa51055bd2bf.jpg)
- భార్యను హత్యచేసిన పట్నాయక్
- ఐదు రోజుల క్రితమే జైలుకు
- ఆందోళనకు దిగిన బంధువులు
హిందూపురం సబ్ జైలులో ఓ ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు అధికారుల కథనం ప్రకారం.. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ ఐదు రోజుల క్రితం భార్యను హత్య చేశాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు హిందూపురం సబ్ జైలుకు తరలించారు. మంగళవారం సాయంత్రం జైలులో ఉరివేసుకున్న అతడిని చూసిన తోటి ఖైదీలు వెంటనే జైలు సిబ్బందికి విషయం తెలియజేశారు. జైలు సిబ్బంది పట్నాయక్‌ను వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు తెలిపారు. పట్నాయక్ మృతిపై అతడి బంధువులు ఆందోళనకు దిగారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అతడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.