Prime Minister: ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు సవాల్!

  • మీ వల్ల దేశానికి ఏం లాభం జరిగింది?
  • కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది?
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయం

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో చర్చకు సిద్ధమా? కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది? నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు?’ అని ప్రశ్నించారు.

తన చర్యల కారణంగా దేశ ప్రజలను మోదీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. బలహీనుల్ని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయమని, సుస్థిర ప్రభుత్వం రాకూడదని, సామంత రాజులు రావాలని చూస్తున్నారని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సుస్థిరత రాకుండా చేస్తున్నారని, తమ దృష్టి మరల్చి, తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ మోదీని దుయ్యబట్టారు.

Prime Minister
Narendra Modi
Chief Minister
Chandrababu
Andhra Pradesh
gst
  • Loading...

More Telugu News