surgical strikes: సర్జికల్ స్ట్రయిక్స్ చాలా రిస్క్ తో కూడుకున్నవని నాకు తెలుసు: ప్రధాని మోదీ

  • నాడు యూరీలో ఉగ్ర ఘటనతో ఉద్వేగం చెందాను
  • ఈ నేపథ్యంలోనే సర్జికల్ దాడులకు వ్యూహం  
  • సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించే తేదీలను 2 సార్లు మార్చాం

2016లో ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక కమెండోలు సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఘటనపై ప్రధాని మోదీ తొలిసారిగా ఇన్నేళ్లకు స్పందించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాడు యూరీలో జరిగిన ఉగ్రదాడులలో సైనికులు మృతి చెందిన ఘటనతో భారత సైన్యమే కాదు, తాను కూడా ఎంతో ఉద్వేగానికి గురయ్యానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే సర్జికల్ స్ట్రయిక్స్ కు వ్యూహం రూపొందించడం జరిగిందని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ చాలా రిస్క్ తో కూడుకున్నదని తనకు తెలుసని, భద్రతా దళాల భద్రతను దృష్టిలో పెట్టుకుని సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించే తేదీల్లో రెండు సార్లు మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఆపరేషన్ లో విజయం సాధించినా, వైఫల్యం చెందినా పట్టించుకోనని, సూర్యోదయానికి ముందే వెనక్కి వచ్చేయాలని నాడు సైన్యానికి స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.

 ఈ ఆపరేషన్ లో  మన సైనికులెవ్వరూ మృతి చెందకూడదన్న స్థిర నిశ్చయం కారణంగానే ఒకవేళ విఫలమైనా గడువు మాత్రం పొడిగించకుండా ముగించుకుని రావాలని సైన్యాన్ని నాడు కోరడం జరిగిందని చెప్పారు.

  • Loading...

More Telugu News