Uttar Pradesh: భర్తల నుంచి విడాకులు తీసుకుని.. ఆ ఇద్దరు యువతులు ఒక్కటయ్యారు!

  • ప్రేమలో పడిన యువతులు
  • ఇరువురికి ఇంతకు ముందే పెళ్లిళ్లు 
  • కలిసి ఉండేదుకు న్యాయపరంగా పోరాటం

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్ పూర్ ‌కు చెందిన ఇద్దరు యువతులు కాలేజ్ సమయంలో ప్రేమలో పడ్డారు. విషయం ఇరువురి ఇళ్లలో తెలియడంతో చదువు మాన్పించి ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు చేశారు. అయినా ఇద్దరూ తమ ప్రేమను మరువలేకపోయారు. దీంతో తమ భర్తలకు విడాకులిచ్చి శనివారం గుడిలో న్యాయవాది సమక్షంలో ఒక్కటయ్యారు. కానీ వీరి వివాహాన్ని ధ్రువీకరించేందుకు రిజిస్ట్రార్ అంగీకరించలేదు. వారి పెళ్లిని గుర్తించేందుకు ఏ చట్టమూ లేదని ఆయన తెలిపారు.

ఈ విషయమై ఆ యువతుల తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆ యువతుల పెళ్లిని గుర్తించని రిజిస్ట్రార్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. తమ పెళ్లి విషయమై యువతుల్లో ఒకరు మాట్లాడుతూ.. తమకు మధ్యలోనే చదువు మాన్పించేసి విడివిడిగా పెళ్లి చేశారని... అయినా తాము ఒకరినొకరం మర్చిపోలేకపోతున్నామన్నారు. అందుకే తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నామని... ఇప్పుడు తాము కలిసి ఉండేందుకు న్యాయపరంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

Uttar Pradesh
Bundelkhand
Women
Divorce
Registar
  • Loading...

More Telugu News