New Year gift: న్యూ ఇయర్ కానుకగా టీవీ ధరలని తగ్గించిన షియోమీ

  • న్యూ ఇయర్ కానుకగా తగ్గిన ధరలు
  • 32, 49 అంగుళాల టీవీలపై ధరలు తగ్గింపు 
  • ట్విట్టర్ లో తెలిపిన షియోమీ

భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ తో పాటు టీవీ మార్కెట్లో టాప్ బ్రాండ్ గా నిలిచిన చైనా కంపెనీ షియోమీ న్యూ ఇయర్ కానుకగా తన వినియోగదారుల కోసం 32, 49 అంగుళాల ఎంఐ టీవీలపై ధరలని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియోమీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలని పొందుపరిచింది.

 32 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ' పై రూ.1500, 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రో' పై రూ.2000 తగ్గించిన షియోమీ, 49 అంగుళాల 'ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో' పై రూ.1000 తగ్గించింది. కాగా, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ(32") ధర రూ.12,499, ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4సీ ప్రో(32") ధర రూ.13,999గా ఉంది. అలాగే ఎంఐ ఎల్.ఈ.డీ టీవీ 4ఏ ప్రో(49") ధర రూ. 30,999కి వినియోగదారులకి అందుబాటులో ఉండనున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News