TRS: మేము టీఆర్ఎస్ లో చేరట్లేదు: శ్రీధర్ బాబు, గండ్ర స్పష్టీకరణ

  • టీఆర్ఎస్ లో చేరుతున్నామన్న దుష్ప్రచారం తగదు
  • కరీంనగర్ కు కేసీఆర్ వస్తున్నారనే ఆయన్ని కలిసేది
  • రీ డిజైనింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం  

తాము టీఆర్ఎస్ లో చేరట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో తాము చేరుతున్నట్లు మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలోనే ఆయన్ని తాము కలుస్తున్నాం తప్ప వేరే ఆలోచనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాము చేసిన రీ డిజైనింగ్ ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  

TRS
Congress
sridhar babu
karimnagar
kaleswaram
gandra
venkataramana redyy
  • Loading...

More Telugu News