allu arjun: తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే త్రివిక్రమ్ మూవీ

  • ఎమోషన్ ప్రధానంగా సాగే త్రివిక్రమ్ మూవీ
  •  బన్నీ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
  • కొత్త కోణంలో తండ్రీ కొడుకుల కథ    

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందనేది ఖాయమైపోయింది. గీత ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయనే విషయంలోను క్లారిటీ వచ్చేసింది. అయితే బన్నీతో త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమా కథాంశం ఏమిటనే విషయంపైనే అభిమానులు దృష్టి పెట్టారు. ఆ విషయానికి సంబంధించి ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ సినిమా కథ తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించినదిగా ఉంటుందనేది తాజా సమాచారం. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' ఒక రకంగా తండ్రీ కొడుకులకి సంబంధించినదే. అయితే ఈ సారి త్రివిక్రమ్ సిద్ధం చేసిన కథ కొత్త కోణంలో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ ఈసారి కూడా తన కథలో యాక్షన్ .. కామెడీతో పాటు ఎమోషన్ కి ప్రాధాన్యతను ఇస్తున్నాడన్న మాట. 

  • Loading...

More Telugu News