New Home: కొత్త ఇల్లు కొనాలని అనుకుంటున్నారా?... కేంద్రం నుంచి మీకో శుభవార్త!

  • గృహ రుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీ
  • మార్చి 2020 వరకూ పొడిగింపు
  • వెల్లడించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ సంవత్సర ఆదాయం ఉన్నవారికి గృహరుణంపై రూ. 2.5 లక్షల సబ్సిడీని అందిస్తున్న పథకాన్ని మార్చి 2020 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్, ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 93 వేల మంది లబ్దిని పొందారని అన్నారు. సబ్సిడీ కింద కేంద్రం రూ. 1,960 కోట్లను అందించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును అందించాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

New Home
Loan
Central Government
Subsidy
PMAY
  • Loading...

More Telugu News