kcr: చరిత్రలోనే చెత్త ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారు: ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్

  • ఏపీకి వచ్చి చంద్రబాబును తిడితే తిరిగి వెనక్కి వెళ్లలేరు
  • రాజకీయాలను హుందాగా చేయాలి
  • కేసీఆర్ వ్యాఖ్యలను సీపీఐ రామకృష్ణ కూడా ఖండించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్... ఏపీకి వచ్చి చంద్రబాబును తిడితే ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ను తిరిగి వెళ్లనివ్వరని చెప్పారు. ఏపీలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేసీఆర్ చెప్పడం, దాన్ని జగన్ సమర్థించడం జరిగిందని... దీంతో బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీల మధ్య ఉన్న లాలూచీ రాజకీయాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. కేసీఆర్ భాష సరిగా లేదని... ఆయన వ్యాఖ్యలను సీపీఐ నేత రామకృష్ణ సైతం ఖండించారని చెప్పారు. రాజకీయాలను హుందాగా చేయాలని సూచించారు. చరిత్రలోనే చెత్త ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, వైసీపీలు దారుణంగా ఓడిపోతాయని తెలిపారు.

kcr
TRS
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
mlc jagadish
  • Loading...

More Telugu News