KCR: విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు నరసింహన్... తెలంగాణ న్యాయమూర్తుల ప్రమాణం!

  • తెలంగాణ చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్
  • రాజ్ భవన్ లో ప్రమాణం చేయించిన గవర్నర్
  • హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ ఉదయం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ సహా 13 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్, ఆపై ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుని, తెలంగాణకు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆపై జస్టిస్ రాధాకృష్ణన్ హైకోర్టులో 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ రామ సుబ్రమణ్యన్, జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగంటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్ బులుసు శివశంకర్ రావు, జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్ లు ప్రమాణం చేశారు.

KCR
Telangana
Narasimhan
High Court
Radha Krishnan
  • Loading...

More Telugu News