IFTU: 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె!

  • కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు
  • డిమాండ్ల సాధన కోసమే సమ్మె
  • ఐఎఫ్టీయూ టీఎస్ కార్యదర్శి శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ, ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగాలని ఐఎఫ్టీయూ నిర్ణయించింది. ఈ సమ్మెలో అన్ని రాష్ట్రాల కార్మిక సంఘాలు, కార్మికులు పాల్గొనాలని ఐఎఫ్టీయూ తెలంగాణ కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ కోరారు.

సమ్మెకు వాల్‌ పోస్టర్‌ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ నరేందర్‌, సహాయ కార్యదర్శి బీ అనురాధ తదితరులతో కలిసి ఆవిష్కరించిన ఆయన, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను చేపట్టినట్టు తెలిపారు. కార్మికుల కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ రక్షణ, రైల్వే, బ్యాంకు, రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించరాదని అన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేసి, కార్మికలోకం సత్తాను కేంద్రానికి చాటడం ద్వారా ఒత్తిడిని పెంచుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News