ajith: జగపతిబాబుకే ఎక్కువ మార్కులు పడిపోయాయి

  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'విశ్వాసం'
  • స్టైలీష్ విలన్ పాత్రలో జగపతిబాబు 
  • జనవరి 10వ తేదీన విడుదల  

అజిత్ కథానాయకుడిగా .. శివ దర్శకత్వంలో 'విశ్వాసం' నిర్మితమైంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళనాట జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో అజిత్ తో పాటు విలన్ గా జగపతిబాబును కూడా చూపించారు.

విలన్ గా జగపతిబాబు లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన మరింత యంగ్ గా .. స్టైలీష్ కనిపిస్తున్నాడని అంటున్నారు. పాత్ర పరంగా ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా డీసెంట్ గా వుందని చెబుతున్నారు. 'నాన్నకు ప్రేమతో' తరువాత ఆ స్థాయిలో ఆయన స్టైలీష్ విలన్ గా కనిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత జగపతిబాబు విలన్ గా తమిళంలో మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి జగపతిబాబు ట్రైలర్ తోనే ఫుల్ మార్కులు కొట్టేశారన్న మాట. 

ajith
nayanatara
jagapathi
  • Loading...

More Telugu News