New Year: అమెరికాలో ఇంకా ప్రారంభం కాని న్యూ ఇయర్ వేడుకలు!

  • కొత్త సంవత్సరానికి ప్రజల స్వాగతం
  • అమెరికాలో ఇంకా సోమవారమే
  • మరికాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు

ఆస్ట్రేలియాతో పాటు, జపాన్, కొరియా ద్వీపకల్పం, మలేషియా, హాంకాంగ్, చైనా, శ్రీలంక, దుబాయ్, లండన్, జర్మనీ, దక్షిణాఫ్రికాలతో పాటు ఇండియాలో 2019 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. అమెరికాలో కొత్త సంవత్సరం వేడుకలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం అమెరికా కాలమానం ప్రకారం సమయం ఇంకా సోమవారం రాత్రి 11 గంటలు కూడా కాకపోవడమే ఇందుకు కారణం.

ఇదిలావుండగా, కౌలాలంపూర్ లోని పెట్రోనాస్ టవర్, హాంకాంగ్ లోని విక్టోరియా హార్బర్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. సిడ్నీ బాణసంచా వెలుగులతో నిండిపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్, దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద లైట్ షో అబ్బుర పరిచింది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కొత్త ఏడాదికి అందరికంటే ముందు స్వాగతం పలికింది.

New Year
2019
USA
Celebrations
  • Loading...

More Telugu News