Loknath: ప్రముఖ కన్నడ నటుడు లోక్‌నాథ్‌ కన్నుమూత

  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లోక్‌నాథ్
  • రవీంద్ర కళాకేత్రంలో భౌతిక కాయం
  • శాండల్‌వుడ్ సంతాపం

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు లోక్‌నాథ్‌ (91) మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో తుదిశ్వాస విడిచిన ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం రవీంద్ర కళాక్షేత్రంలో ఉంచారు. 650కిపైగా సినిమాల్లో నటించిన లోక్‌నాథ్ వెయ్యి నాటకాల్లోనూ నటించారు. 1970లో ‘సంస్కార’ అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనను ‘ఉప్పినకాయి’ అని ఆప్యాయంగా పిలుస్తారు. 2016లో నటించిన ‘రే’ ఆయన చివరి సినిమా. లోక్‌నాథ్ మృతికి శాండల్‌వుడ్ నటులు సంతాపం తెలిపారు. కాగా, లోక్‌నాథ్ ఇటీవల అంబరీష్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆయనకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Loknath
Kannada Actor
Died
Bangaluru
sandalwood
  • Loading...

More Telugu News