Odisha: సెల్ఫీ తీసుకోబోతూ జలపాతంలో పడి విద్యార్థి మృతి

  • భీమ్‌కుండ్ జలపాతానికి వెళ్లిన రోహోన్
  • కాలు జారి నీటిలో పడిపోయాడు
  • రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు

సెల్ఫీల మోజుతో ఓ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. ఒడిశాలోని భీమ్‌కుండ్ జలపాతానికి స్నేహితులతో సరదాగా వెళ్లిన ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకోబోతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణం కోల్పోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. భీమ్‌కుండ్ జలపాతం వద్ద స్నేహితులతో కలిసి కటక్‌కు చెందిన రోహోన్ మిశ్రా సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు అతని స్నేహితులతో పాటు అక్కడున్నవారు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పోలీసు అధికారులు వెల్లడించారు.

Odisha
Bheemkund
Rohon misra
Selfie
Katak
  • Loading...

More Telugu News