Koppula Eshwar: కొప్పుల ఈశ్వర్ ఆరోపణల్లో నిజం లేదు: మాజీ ఎంపీ వివేక్

  • నేను ప్రచారం చేసిన మండలాల్లో అధిక మెజారిటీ
  • వ్యాపారంలో నష్టం కారణంగా నగదు నిల్వ లేదు
  • మా అన్నకు కూడా సాయం చేయలేకపోయా

టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి అత్యల్ప మెజారిటీతో విజయం సాధించిన కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వివేక్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన వివేక్ ఎన్నికల్లో తాను మనస్ఫూర్తిగా పనిచేశానని.. తాను ప్రచారం చేసిన మండలాల్లో అధిక మెజారిటీ వచ్చిందని వెల్లడించారు.

తన వ్యాపారంలో నష్టం కారణంగా నగదు నిల్వలేక ఆర్థికంగా సాయం చేయలేకపోయానన్నారు. ఆఖరికి తన అన్న వినోద్‌కు కూడా డబ్బు సాయం చేయలేకపోయానని వెల్లడించారు. ఈశ్వర్‌కు మెజారిటీ తక్కువ రావడంలో తన పాత్రేమీ లేదని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా వివరించానన్నారు. తాను కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని చూశాననడం అవాస్తవమన్నారు.

Koppula Eshwar
Vivek
Vinod
TRS
KTR
KCR
  • Loading...

More Telugu News