Maharashtra: నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో తెల్గీ నిర్దోషి.. చనిపోయిన ఏడాదికి కోర్టు తీర్పు!

  • తెల్గీకి 30ఏళ్ల కఠిన కారాగార శిక్ష
  • తీర్పు వెలువరించిన నాశిక్ కోర్టు
  • మెనింజైటిస్ వ్యాధితో తెల్గీ మృతి

నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో నేడు మహారాష్ట్రలోని నాశిక్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అబ్దుల్ కరీం తెల్గీ సహా పలువురు నిందితులకు విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పిచ్చింది. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెల్గీ గతేడాది మెనింజైటిస్ వ్యాధితో బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

2001 నవంబర్‌లో అరెస్టైన తెల్గీకి నకిలీ స్టాంప్ పేపర్ల రాకెట్ నడిపినట్టు తేలడంతో 30ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.202 కోట్ల జరిమానా పడింది. పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తూనే గత ఏడాది అక్టోబర్‌లో తెల్గీ మరణించాడు.

  • Loading...

More Telugu News