YSRCP: వైసీపీ నేతలకు జైలు గోడలు, కోర్టు మెట్లు మాత్రమే తెలుసు!: ఏపీ మంత్రి ఉమ చురకలు

  • గోదావరి జలాలపై ప్రతిపక్షాలకు ఏమీ తెలియదు
  • రూ.రెండు లక్షల కోట్ల కేసుల్లో జగన్ ఏ1 నిందితుడు
  • గ్రామదర్శినిలో విరుచుకుపడ్డ టీడీపీ నేత

పోలవరం, గోదావరి జలాలపై ప్రతిపక్ష నేతలకు ఏమీ తెలియదని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. వైసీపీ నేతలకు జైలు గోడలు, కోర్టు మెట్లు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై 2 లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి కేసులు ఉన్నాయని దుయ్యబట్టారు. ఈ కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ కు బాబాయి వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేత, మైలవరం అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బినామీ అని ఆరోపించారు. కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం మండలంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మైలవరం వైసీపీ నేత వసంత  వెంకట కృష్ణ ప్రసాద్, ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు 2014లో టీడీపీలో చేరి పనులు చక్కబెట్టుకున్నారని విమర్శించారు. తాజాగా ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీలో చేరి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్‌, జూలై నాటికి గ్రామాల్లోకి గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు.

  • Loading...

More Telugu News