vijayawada: కొత్త సంవత్సర వేడుకలు.. విజయవాడలో ట్రాఫిక్ అలర్ట్

  • మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
  • ప్లైఓవర్లపై రాకపోకల నిలిపివేత
  • ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బందోబస్తు

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నగర కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లైఓవర్లపై రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బందోబస్తు ఉంటుందని చెప్పారు. రేపు తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవం, చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం ఉండటంతో... ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

vijayawada
new year
police
alert
  • Loading...

More Telugu News