new zeland: అప్పుడే న్యూజిలాండ్ లో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు

  • 2019 లోకి  ముందుగా అడుగుపెట్టిన న్యూజిలాండ్
  • ఆక్లాండ్ లో ఆనందోత్సాహాలు
  • ‘హ్యాపీ న్యూ ఇయర్’ చెప్పుకొన్న ప్రజలు

కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ప్రజలు స్వాగతం పలికారు. 2019 సంవత్సరంలోకి న్యూజిలాండ్ ముందుగా అడుగుపెట్టింది. ఆక్లాండ్ లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆక్లాండ్ లోని ప్రఖ్యాత స్కైటవర్ పై ఏర్పాటు చేసిన బాణసంచా పేలుళ్లను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఆక్లాండ్ హార్బర్ వంతెన వద్ద తొలిసారిగా నిర్వహించిన లైట్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు.

new zeland
new year
2019
oakland
wishes
  • Loading...

More Telugu News