jayalalitha: జయలలితకు సరైన చికిత్స అందించలేదు: తమిళనాడు న్యాయశాఖా మంత్రి షణ్ముగం

  • మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించలేదు
  • తీసుకెళ్లినట్టయితే ఆమె బతికేవారు
  • జయలలిత మృతి వెనుక అన్నీ అనుమానాలే

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సరైన చికిత్స అందించలేదని తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలితను ఆసుపత్రిలో చేర్చిన వెంటనే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకువెళితే ఆమె బతికి ఉండేవారని, ఆమెను విదేశాలకు తీసుకెళ్లకుండా ఉండేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు.

 జయలలిత మృతి వెనుక అన్నీ అనుమానాలే ఉన్నాయని, దీనిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. కాగా, తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ జె.రాధాకృష్ణన్, అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి కుట్రలు పన్ని జయలలితకు సరైన చికిత్స అందించలేదని ఈ కేసు విచారణ నిర్వహిస్తున్న కమిషన్ కౌన్సిల్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను రాధాకృష్ణన్ ఖండించిన విషయం తెలిసిందే.

jayalalitha
Tamilnadu
Chief Minister
law minister
apollo
shanmugham
abroad
  • Loading...

More Telugu News