visaka-chennai: విశాఖ-చెన్నై కారిడార్ కోసం కేంద్రం గ్రాంటు ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

  • ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదు
  • ఢిల్లీ-ముంబై  కారిడార్ లో కేంద్రం పెట్టుబడి పెట్టింది
  • గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయలేదు

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న హామీని నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ లో పెట్టుబడి పెట్టిన కేంద్రం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం గ్రాంటు ఇవ్వలేదని, ఏపీలో గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలన్న హామీని కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏపీలోని `75 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపిస్థామని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవర్టన్, పతంజలి, జైన్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ తదితర పరిశ్రమలు వచ్చాయని గుర్తుచేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News