kurnool: కర్నూలులో అద్భుత ఘట్టం.. ల్యాండ్ అయిన తొలి విమానం.. వీడియో చూడండి
- కర్నూలు విమానాశ్రయంలో ట్రయల్ రన్
- 7న ఎయిర్ పోర్టును ప్రారంభించనున్న చంద్రబాబు
- ఆనందం వ్యక్తం చేస్తున్న కర్నూలు వాసులు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాయలసీమలో మరో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. కర్నూలులో నిర్మించిన విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ కోసం తొలి విమానాన్ని కర్నూలు ఎయిర్ పోర్టు రన్ వే పై ల్యాండ్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన విమానం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు, తమ నగరంలో విమానం ల్యాండ్ కావడంతో కర్నూలు వాసులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో ఇది నాలుగవ ఎయిర్ పోర్టు. 2017 జూన్ లో ఎయిర్ పోర్టు పనులను చేపట్టారు. రూ. 90.5 కోట్లతో టర్మినల్, టవర్ భవనం, రన్ వే, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.