Chandrababu: తొమ్మిదవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు

  • ఐటీ, పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలపై శ్వేతపత్రం
  • సంపద సృష్టికి పరిశ్రమలు, సేవల రంగాలే కీలకం
  • చారిత్రక కారణాల వల్ల ఈ రంగాలలో కొంచెం వెనుకబడ్డాం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులపై శ్వేతపత్రాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు, సంపదను సృష్టించేందుకు పరిశ్రమలు, సేవల రంగాలే ముఖ్యమని చెప్పారు. చారిత్రక కారణాల వల్ల పారిశ్రామిక, సేవారంగాల్లో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. 12 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... అయితే, 10.5 శాతం వృద్ధిని మాత్రమే సాధించామని చెప్పారు. వ్యవసాయరంగం నుంచే 55 శాతం ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఈ శక్తిని పారిశ్రామిక, సేవారంగానికి మార్చగలిగితే తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News