Pawan Kalyan: పవన్ కాకుంటే ఇంకొకరితో పెళ్లి జరిగేది... తల్లిని అయ్యేదాన్ని: రేణు దేశాయ్

  • 12 ఏళ్లు పవన్ కల్యాణ్ కు భార్యగా ఉన్నాను
  • ఇంకొకరితో వివాహమైనా ఇవే అనుభవాలు వచ్చేవి
  • 'ఏ లవ్ అన్ కండిషనల్'పై రేణు దేశాయ్

తాను 12 సంవత్సరాలు పవన్ కల్యాణ్ కు భార్యగా ఉన్నానని, ఆయనతో కలిసి ఇద్దరు బిడ్డలకు తల్లినయ్యానని వ్యాఖ్యానించిన రేణు దేశాయ్, ఒకవేళ, ఆయనతో కాకుంటే, ఇంకొకరితో తనకు పెళ్లయ్యేదని, వారితో బిడ్డలను కనివుండేదాన్నని వ్యాఖ్యానించారు. రేణు రచించిన 'ఏ లవ్ అన్ కండిషనల్' పుస్తకాన్ని అనంత శ్రీరామ్ తెలుగులోకి అనువదించగా, దీనిపై విమర్శలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన ఆమె, పవన్ తో కాకుండా తనకు వేరే వ్యక్తితో వివాహమైతే, అతని ద్వారా కూడా ఇవే అనుభవాలను తాను పొందివుండేదాన్నని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. తన అనుభవాలనే కవితలుగా మార్చానని, వీటిని తెలుగులోకి అనువదించేందుకు సహకరించిన అనంత శ్రీరామ్ కు కృతజ్ఞతలని ఆమె అన్నారు. తన తల్లిదండ్రులు ఇంగ్లీష్ ను ఎక్కువగా నేర్పించినందునే ఆంగ్లంలో దీన్ని రచించానని, మాతృభాషలో తన భావాలను వ్యక్తపరచలేకపోయానని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan
Renu Desai
A Love Unconditional
  • Loading...

More Telugu News