new year: మా పాటలు ఎలా వాడతారు?: హోటళ్లు, పబ్‌లు, కేఫ్‌లు, రిసార్ట్‌లకు నోవెక్స్‌ కమ్యూనికేషన్‌ నోటీసులు

  • లక్ష పాటలపై తమకు పేటెంటుందని వెల్లడి
  • తమ అనుమతి లేకుండా వాటిని ప్రదర్శిస్తే చర్యలని హెచ్చరిక
  • కరపత్రాలు, టికెట్లలలో ముద్రణపై అభ్యంతరం

కొత్త సంవత్సరం వేడుకలకు ముస్తాబవుతున్న హోటళ్లు, పబ్‌లు, కేఫ్‌లు, రిసార్ట్‌లకు నోవెక్స్‌ కమ్యూనికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కోర్టు నోటీసులు జారీ చేసి షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ మహానగరంలోని మొత్తం 79 సెంటర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. న్యూ ఇయర్‌ వేడుకల ప్రచారం కోసం ఆయా సంస్థలు ముద్రించిన కరపత్రాలు, టికెట్లు, హోర్డింగ్‌లపై అభ్యంతరం వ్యక్తంచేసింది. కాపీ రైట్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేటెంట్‌ ఉన్న సంస్థల అనుమతి తీసుకోకుండా బాలీవుడ్‌ పాటలు ప్రదర్శిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రచారం చేసుకోవడాన్ని సంస్థ తప్పుపట్టింది.

 లక్షకు పైగా పాటలపై తమ సంస్థకు పేటెంటు ఉందని, ఆయా పాటలను బహిరంగంగా ప్రదర్శించే ముందు తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని నోటీసుల్లో పేర్కొంది. ముంబయికి చెందిన సంస్థ ప్రతినిధి విక్కీమదన్‌ డిసెంబరు 28 సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో ఆయా హోటళ్లు, రిసార్ట్స్‌ల పేర్లు, చిరునామాలతో ఆధారాలు జత చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు అనుమతిలేకుండా నిర్వహిస్తే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News