Pawan Kalyan: ఏం మాట్లాడినా నా మాజీ భర్త గురించేనా?: రేణు దేశాయ్

  • 'ఏ లవ్ అన్ కండిషనల్' పుస్తకం రాసిన రేణు దేశాయ్
  • అది పవన్ గురించేనని కామెంట్లు
  • స్పందించిన రేణు దేశాయ్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రాసిన 'ఏ లవ్ అన్ కండిషనల్' పుస్తకం వివాదాన్ని రేపుతున్న వేళ, ఆమె వివరణ ఇచ్చారు. తాను ఆనందంతో రాసినా, బాధతో రాసినా, భావోద్వేగంతో రాసినా, రొమాంటిక్ గా రాసినా, వాటిని తన మాజీ భర్త పవన్ కల్యాణ్ గురించేనని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ సంతోషం, సుఖం, దుఖం ఉంటాయని, తన జీవితంలోనూ అవన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

 'ఏ లవ్ అన్ కండిషనల్' పుస్తకాన్ని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలుగులోకి అనువదించగా, ఇది చదివిన ప్రతి ఒక్కరూ రేణూ దేశాయ్ పై జాలి చూపిస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు రచనా వ్యాసంగంపై ఆసక్తి పుట్టిందని, అప్పటి నుంచే తాను ట్విట్టర్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు రేణు. తాను రచించింది తన మనసులోని మాటలే తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కాదని అన్నారు.

Pawan Kalyan
Renu Desai
A Un Conditional Love
  • Loading...

More Telugu News