Sridevi: 'నేను చేసిన పని డాడీకి తెలిస్తే చంపేస్తారు' అంటూనే హాట్ షూట్ లో జాన్వి!

  • ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్
  • జుట్టును పొట్టిగా కత్తిరించుకున్న జాన్వీ కపూర్
  • తండ్రికి తెలియదని వ్యాఖ్య

దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వి కపూర్‌, ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు హాట్ హాట్ గా ఫొటో షూట్‌ ఇవ్వగా, అది వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఫొటో షూట్‌ కోసం, తన జుట్టును పొట్టిగా కత్తిరించుకున్న ఆమె, ఈ విషయం తన తండ్రి బోనీ కపూర్‌ కు తెలియదని చెబుతోంది. ఈ విషయం ఆయనకు తెలిస్తే తనను చంపేస్తారని కూడా వ్యాఖ్యానించింది. గతంలో 'బ్రైడ్స్‌ టుడే', 'వోగ్‌', తదితర పత్రికలకు ప్రత్యేక ఫోటోలు ఇచ్చిన ఆమె, తన తొలి చిత్రం 'ధడక్'తో ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ దర్శక, నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'తఖ్త్'తో పాటు మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sridevi
Jahnvi Kapoor
Boney Kapoor
Photo Shoot
  • Loading...

More Telugu News