Andhra Pradesh: చంద్రబాబూ.. ఒక్కో బిల్డింగుకు నాలుగు సార్లు శంకుస్థాపనా!: టీఆర్ఎస్ ఎంపీ గుత్తా

  • జగన్ ను ఎదుర్కోలేకే బాబు గిమ్మిక్కులు
  • బాబు ముసుగు తీసేస్తే బీజేపీ కనిపిస్తుంది
  • 2019 ఎన్నికల్లో 16 లోక్ సభ సీట్లు మావే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేత, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించాలని చంద్రబాబు చేసిన కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. బాబు ముసుగు తీసేస్తే కనిపించేది బీజేపీయేనని ఎద్దేవా చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన గుత్తా, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

ఏపీలో ఒక్కో భవనానికి నాలుగుసార్లు శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబుదేనని గుత్తా ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు ఈ గిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలను ఏపీ, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 16 లోక్ సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తామని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
TRS
Telugudesam
gutta
sukhander reddy
  • Loading...

More Telugu News