Andhra Pradesh: చిన్నారి వీరేశ్ కిడ్నాప్ సుఖాంతం.. బాబును ఏపీ పోలీసులకు అప్పగించిన పోలీసులు!

  • కోర్టు సమక్షంలో అప్పగించిన మహారాష్ట్ర పోలీసులు
  • చిన్నారి, నిందితుడితో బయలుదేరిన అధికారులు
  • సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం

తిరుమలలో వీరేశ్ అనే చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గాలింపును ముమ్మరం చేశారు. పిల్లాడిని ఎత్తుకువెళుతున్న నిందితుడి ఫొటోలను వైరల్ చేశారు. దీంతో మహారాష్ట్రలో నిందితుడు విశ్వంభరను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. తాజాగా మహారాష్ట్ర పోలీసులు చిన్నారి వీరేశ్ ను, నిందితుడు విశ్వంభరను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు.

స్థానిక కోర్టు సమక్షంలో వీరిని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. దీంతో అధికారులు నిందితుడితో పాటు చిన్నారిని తీసుకుని ఏపీకి బయలుదేరారు. కాగా, ఈరోజు సాయంత్రం తిరుపతిలో ఈ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని పోలీస్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు తిరుమలలో నిద్రిస్తుండగా 16 నెలల వీరేశ్ ను విశ్వంభర ఎత్తుకెళ్లాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News