Hyderabad: హైదరాబాద్ సన్ సిటీ మాల్ లో హిజ్రాల హల్ చల్.. భయభ్రాంతులకు గురైన కస్టమర్లు!

  • మాల్ కు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని డిమాండ్
  • రూ. 1000 తీసుకునేందుకు ససేమిరా
  • బట్టలు విప్పదీస్తూ వీరంగం

హైదరాబాద్ లో హిజ్రాల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులను డబ్బులు అడగడం, సాయంత్రమైతే, అన్ని రోడ్లపై ఉన్న అన్ని దుకాణాలకూ వెళ్లి యాచించడంతో పాటు, ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్లి కూడా తమ దందాను సాగిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ శివార్లలోని గండిపేట మాల్ కు వెళ్లిన కొందరు హిజ్రాలు అక్కడ చాలా నీచంగా ప్రవర్తిస్తూ, వీరంగం చేశారు.

మాల్ కు వచ్చిన హిజ్రాలు, రూ. 2 వేలు డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ. 1000 ఇచ్చింది. అయితే, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు ససేమిరా అంటూ, తమ బట్టలు విప్పుతూ, మాల్ కు వచ్చిన ప్రజల ముందు అసభ్యంగా ప్రవర్తించారు. కస్టమర్లను లోపల ఉంచి మాల్ కు తాళాలు వేసి, అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. హిజ్రాల దాడితో వినియోగదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మాల్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని అక్కడినుంచి తరలించారు.

Hyderabad
Gandipet
Hizra
Demand
  • Loading...

More Telugu News