Dubai: పాకిస్థానీయులు నన్ను హింసించారు.. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే విమానంలో దుస్తులు విప్పేశా: వెల్లడించిన ప్రయాణికుడు

  • పాకిస్థానీయులు నన్ను హింసించేవారు
  • దేశం విడిచి వెళ్లాలని చావగొట్టేవారు
  • వారి బాధలు భరించలేక రాజీనామా చేశా

దుబాయ్ నుంచి లక్నో వస్తున్న ఎయిరిండియా విమానంలో దుస్తులు విప్పేసి కలకలం రేపిన ప్రయాణికుడు తానెందుకు అలా చేయాల్సి వచ్చిందీ వివరించాడు. దుబాయ్‌లో తాను పనిచేస్తున్న కంపెనీలో పాకిస్థానీయులదే రాజ్యమని, తానొక్కడినే భారతీయుడినని పేర్కొన్న ప్రయాణికుడు.. వారు తరచూ తనను హింసిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. విచక్షణ రహితంగా తనను కొట్టేవారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హింసించే వారని చెబుతూ బావురుమన్నాడు. వారి వేధింపులు భరించలేక, మనసు వికలమై రాజీనామా చేసి స్వదేశం బయలుదేరినట్టు చెప్పాడు.

విమానంలో దుస్తులు విప్పేసి కలకలం రేపిన ప్రయాణికుడి చేష్టలతో ఒక్కసారిగా అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడి ఒంటిపై దుప్పటి కప్పి కూర్చోబెట్టారు. విమానం లక్నో విమానాశ్రయంలో ల్యాండయ్యాక భద్రతా సిబ్బందికి అతడిని అప్పగించారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫ్రస్ట్రేషన్‌తోనే అతడు అలా ప్రవర్తించినట్టు తెలిపారు. చేసిన తప్పునకు క్షమాపణలు వేడుకున్నట్టు పేర్కొన్నారు. అతడి గురించి పూర్తిగా విచారించిన తర్వాత అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు.

Dubai
Lucknow
Air India flight IX-194
Pakistan
apologised
stripped
frustrated
  • Loading...

More Telugu News