Drunk Driving: సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్... దొరికితే జైలే... హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు!

  • మద్యం మత్తులో వాహన ప్రమాదాలు
  • నేటి రాత్రంతా రోడ్లపైనే పోలీసుల మకాం
  • పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు పెట్టి అవగాహన

మందు కొట్టి వాహనాలను నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయని, నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మందు కొట్టి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో దొరికిపోతే ఆరు నెలల వరకూ జైలు శిక్షను అనుభవించాల్సి రావచ్చని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 "రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలో భాగంగా 31, డిసెంబర్ సాయంత్రం నుంచి 1, జనవరి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో నిర్విరామంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహించబడును. మద్యం సేవించి వాహనం నడిపిన వారికి (ఎంవీ యాక్ట్. సెక్షన్ 185) చట్ట ప్రకారం, సంబంధిత కోర్టు ఆరు నెలల వరకు జైలుశిక్ష విధించవచ్చును. కావున వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపకూడదని మనవి" అని బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. కాగా, నేటి రాత్రంతా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రహదారులపై మకాం వేసి, మందుబాబులకు చెక్ చెప్పాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.

Drunk Driving
Hyderabad
Police
  • Loading...

More Telugu News