Telugudesam: కోరిక తీరింది... తలనీలాలు, గడ్డం తీయించుకున్న సీఎం రమేశ్!

  • కాలినడకన తిరుమలకు వచ్చిన సీఎం రమేశ్
  • శ్రీవారికి తలనీలాల సమర్పణ
  • ఈ ఉదయం స్వామి దర్శనంతో తీరిన మొక్కు

తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ తన మొక్కును తీర్చుకున్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చేవరకూ తాను గడ్డం తీయబోనని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. గత వారంలో చంద్రబాబు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో, ఆదివారం రాత్రి కుటుంబసభులతో కలసి శ్రీవారిమెట్టు మార్గంలో సీఎం రమేశ్ కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి, గడ్డం తీశారు. ఈ ఉదయం సీఎం రమేశ్ కుటుంబీకులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రొటోకాల్ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి, రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేయించారు.

Telugudesam
CM Ramesh
Tirumala
Kadapa
Steel Plant
  • Loading...

More Telugu News