Nagamalleswara Rao: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. భార్యాభర్తలిద్దరూ మృతి

  • బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం
  • ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • చికిత్స పొందుతూ మృతి

శుభకార్యానికి వెళ్లి వస్తూ విశ్రాంత ఉద్యోగి, అతని భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ నగర శివారు లెక్చరర్స్ కాలనీకి చెందిన నాగమల్లేశ్వరరావు(65), అతని భార్య ఇందిర(58) నేటి మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో శుభకార్యానికి హాజరయ్యారు.

కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి తమ ఇంటికి బైక్‌పై వస్తుండగా హైకోర్టు కాలనీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై రోడ్డుకు చివరన ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సి పొందుతూ ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Nagamalleswara Rao
Hyderabad
Indira
accident
Hospital
  • Loading...

More Telugu News