Maharshi: ‘రిషితో అపాయింట్‌మెంట్ ఫిక్స్.. అతడి ప్రయాణంలో భాగమవ్వండి’ అంటున్న ‘మహర్షి’ చిత్రబృందం

  • ‘మహర్షి’ రెండో లుక్ రేపు విడుదల
  • రిషితో కలిసి న్యూఇయర్ వేడుక జరుపుకోండి
  • రిషిలోని మరో కొత్త కోణాన్ని చూడండి

సినీ ప్రియులకు నూతన సంవత్సర కానుకలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే అప్‌డేట్స్ ఇస్తామని జెర్సీ, వినయ విధేయ రామ చిత్రబృందాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ నుంచి కూడా కొత్త లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు ఆ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను ప్రకటించారు.

‘రిషి’తో మీ అపాయింట్‌మెంట్ ఫిక్స్‌ అయ్యింది. అతడి ప్రయాణంలో భాగం అవ్వండి’ అంటూ పోస్టర్‌లో చిత్రబృందం పేర్కొంది. ఈ విషయమై వంశీ.. ‘‘మహర్షి’ రెండో లుక్‌.. రిషితో కలిసి న్యూఇయర్‌ వేడుకను జరుపుకోండి. రేపు ఇదే సమయానికి అతడిలోని మరో కోణాన్ని చూడండి’ అని ట్వీట్ చేశారు.

Maharshi
Mahesh Babu
Vamsi Paidipally
Jersy
vinaya vidheya rama
  • Loading...

More Telugu News