Ramana: చేతిలో అధికారం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: టీడీపీ ధ్వజం

  • కేసీఆర్ వ్యాఖ్యలను ప్రజలు హర్షించరు
  • స్థాయిని మరచి మాట్లాడుతున్నారు
  • గత చరిత్రను గుర్తు చేసుకోవాలి

రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హూందాతనాన్ని, స్థాయిని మరచి మాట్లాడుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నేడు టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చేతిలో అధికారం ఉంది కదా అని కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. కేసీఆర్ వ్యాఖ్యలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే ముందు కేసీఆర్ తన గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని రమణ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

Ramana
Ravula chandrasekhar Reddy
Chandrababu
KCR
TRS
  • Loading...

More Telugu News