bengali director: దర్శకుడు మృణాల్ సేన్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

  • నవసినీ ఉద్యమానికి ఆద్యుడు మృణాల్ సేన్
  • ఆయన చిత్రాలు కలకాలం నిలిచిపోతాయి
  • బెంగాలీ సహా అనేక భాషల్లో  చిత్రాలు నిర్మించారు

ప్రముఖ దర్శక-నిర్మాత, పద్మభూషణ్ గ్రహీత మృణాల్ సేన్ మృతిపై సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నవసినీ ఉద్యమానికి ఆద్యుడు మృణాల్ సేన్ అని కొనియాడారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు కలకాలం నిలిచిపోతాయని, బెంగాలీ సహా అనేక భాషల్లో నిర్మించిన సందేశాత్మక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. కాగా, దిగ్గజ బెంగాలీ ఫిల్మ్ మేకర్, పలు జాతీయ అవార్డుల గ్రహీత మృణాల్ సేన్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని సొంత ఇంటిలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. 

bengali director
mrunal sen
demise
cm
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News