Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి అత్తయ్య మృతి

  • వెంకయ్యనాయుడి అత్త కౌసల్యమ్మ మృతి
  • కొంతకాలంగా చెన్నైలో చికిత్స
  • రేపు శ్రీరామపురంలో అంత్యక్రియలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య ఉషారాణి తల్లి అల్లూరి కౌసల్యమ్మ (అల్లూరి చినమస్తానయ్య నాయుడి భార్య) నేడు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. వెంకయ్య నాయుడి కుటుంబంతో పాటే ఢిల్లీలో వుండే ఆమె ఇటీవల అక్కడ చలి తీవ్రమవడంతో, చెన్నైలో ఉంటున్న వెంకయ్యనాయుడి కూతురు దీపా వెంకట్ వద్దకు వెళ్లారు.  

ఆమె మరణ వార్త తెలుసుకున్న వెంకయ్యనాయుడు వెంటనే ఢిల్లీ నుంచి నెల్లూరు బయలుదేరారు. కౌసల్యమ్మ అంత్యక్రియలు రేపు ఆమె స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం, శ్రీరామపురం గ్రామంలో జరగనున్నాయి.  

Venkaiah Naidu
Kousalyamma
chinmastanayya
chennai
  • Loading...

More Telugu News