Tiger: పులుల సంరక్షణకు రూ.100 కోట్ల ఖర్చు... అయినా ఫలితం దక్కని వైనం!
- తగ్గుతున్న పులుల సంఖ్య
- ఏటా రూ.5-6 కోట్లు ఖర్చు
- 2006లో 100కి పైగా పులులు
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతుంటే ఒడిషాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌లో మాత్రం తగ్గుతోంది. ఈ టైగర్ రిజర్వ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల పులులకు ప్రసిద్ధి. వీటితో పాటు పెద్దపులులకు కూడా ఆవాసంగా ఉంది. అయితే ఇక్కడ పులుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
పులుల సంరక్షణ కోసం కేంద్రం ఏటా రూ.5 నుంచి రూ.6 కోట్ల చొప్పున ఇప్పటి వరకూ రూ.100 కోట్లు ఖర్చు పెట్టింది. 2006లో వీటి సంఖ్య 100కి పైగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 28కి చేరింది. ఈ మధ్య కాలంలో దాదాపు 75 పులులు చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.