Andhra Pradesh: ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారూ!: జగన్

  • ఏపీ ప్రజల కోసం మేం ఉద్యమిస్తూనే ఉన్నాం
  • చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదని టీడీపీ నేతలు ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. అందుకే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో దీక్షలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై  జగన్ స్పందించారు. టీడీపీ నేతలకు తెలియకపోయినా తాము ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉన్నామని జగన్ తెలిపారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు.

జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘రాజకీయ నాటకంలో కుట్రపూరిత  కూటములు కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ, ఏపీ పాలనను గాలికొదిలేసి తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు.. మా ఉద్యమాలు తెలియకపోవచ్చు. కానీ మేము చేసిన నిరంతర పోరాటం రాష్ట్రప్రజలకు సుపరిచితం. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారూ!’ అని ట్వీట్ చేశారు. 

Andhra Pradesh
Telangana
kadapa
steel plant
Jagan
YSRCP
counter
Twitter
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News