Andhra Pradesh: అభిమానులు, కార్యకర్తల కోసం జనసేన 2019 క్యాలెండర్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

  • ఎరుపురంగులో ఫొటోలతో విడుదల
  • ట్విట్టర్ లో లింక్ పోస్ట్ చేసిన పార్టీ
  • యూరప్ లో పర్యటిస్తున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తాజాగా నూతన సంవత్సరం నేపథ్యంలో జనసేన పార్టీ 2019 క్యాలెండర్ ను విడుదల చేసింది. ఎరుపురంగులో పార్టీ గుర్తుతో క్యాలెండర్ ను జనసేన రిలీజ్ చేసింది. దీనికి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న, పోరాటయాత్రలో నడుస్తున్న ఫొటోలను జతచేసింది. అభిమానులు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ట్విట్టర్ లో లింక్ ను పోస్ట్ చేసింది.


Andhra Pradesh
Telangana
Jana Sena
calender-2019
release
Twitter
  • Loading...

More Telugu News