Andhra Pradesh: అనంతపురంలో టీడీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన గుర్నాథ్ రెడ్డి!

  • గుర్నాథ్ రెడ్డితో పాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా
  • టీడీపీలో చేరి తప్పుచేశానని వ్యాఖ్య
  • చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన నేత

కర్నూలు జిల్లాలో నిన్న టీడీపీ నేత రాంపుల్లారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని గుర్నాథ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు.

సీఎం చంద్రబాబు పాలన బాగుందని తాను వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోకి చేరి తప్పు చేశానని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. కాగా, గుర్నాథ్ రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పలాసలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర ముగిశాఖ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పేర్కొన్నాయి.

Andhra Pradesh
Anantapur District
Telugudesam
resign
YSRCP
gurnath reddy
  • Loading...

More Telugu News