Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి షాక్.. త్వరలో రాజీనామా చేయనున్న విష్ణుకుమార్ రాజు!

  • హోదా, విభజన హమీల విషయంలో ఇబ్బంది
  • బీజేపీలో కొనసాగలేమని నిర్ణయం
  • భవిష్యత్ కార్యాచరణ ప్రకటించని నేత

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి షాక్ తగలనుందా? అసెంబ్లీలో బీజేపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆ పార్టీకి గుడ్ డై చెప్పనున్నారా? అంటే ఆయన సన్నిహిత వర్గాలు అవుననే జవాబు ఇస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీలో కొనసాగడం ఎంతమాత్రం సరికాదని విష్ణుకుమార్ రాజు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాజు పార్టీ కార్యకలాపాలకు గత 3 నెలలుగా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా విభజన హామీలు, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరితో ఆయన ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే విష్ణుకుమార్ రాజు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News