Andhra Pradesh: పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని.. దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!

  • ఆలయానికి చేరుకున్న జనసేన శ్రేణులు
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయవాడ నేతలు
  • జనసేనకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ జనసేన శ్రేణులు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాయి. విజయవాడ సెంట్రల్ కు చెందిన నేతలు, కార్యకర్తలు ఈరోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కు ఏపీలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని తెలిపారు. త్వరలోనే మరింత మంది నేతలు జనసేనలో చేరుతారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పవన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telangana
Pawan Kalyan
durga temple
special pooja
Chief Minister
Vijayawada
  • Loading...

More Telugu News