Tim Paine: భారత పేస్ బౌలింగ్ ప్రపంచంలోనే అద్భుతం: ప్రశంసల వర్షం కురిపించిన టిమ్ పైన్

  • ఓటమి నిరాశను కలిగించింది
  • అనుభవరాహిత్యమే కొంపముంచింది
  • మీడియాతో టిమ్ పైన్

ప్రపంచంలోనే అద్భుతమైన పేస్ బౌలింగ్ లైనప్ ఉన్న జట్టుతో తాము ఆడి ఓడిపోయామని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. మెల్ బోర్న్ లో మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఓటమి కొంత నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించాడు.

తాము పెర్త్ లో విజయం సాధించి ఇక్కడికి వచ్చామని, ఇక్కడ విజయమే లక్ష్యంగా పోరాడామని, అయితే, బ్యాట్స్ మన్ అనుభవరాహిత్యం కొంపముంచిందని చెప్పాడు. దిగ్గజ పేస్ బౌలర్లు టీమిండియాలో ఉన్నారని, వారి కారణంగానే విజయం సాధించలేకపోయామని చెప్పాడు. తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ సిడ్నీకి వెళతామని, బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పాడు.

 ఈ మ్యాచ్ లో క్రెడిట్ అంతా బుమ్రా, ఇషాంత్, షమీలకే తాను ఇస్తున్నానని, ఆసీస్ ఆటగాళ్లలో కుమిన్స్ ఆటతీరు అద్భుతమని అన్నాడు. కొత్త సంవత్సరంలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి చేరనున్నారని చెప్పిన టిమ్ పైన్, సిడ్నీ టెస్టులో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Tim Paine
India
Australia
Pace Bowling
  • Loading...

More Telugu News