gitam: మా బీటెక్ డిగ్రీలు చెల్లుతాయి.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వ్యాఖ్యలు నిజం కాదు!: గీతం విశ్వవిద్యాలయం

  • గీతం డిగ్రీలకు ఏఐసీటీఈ గుర్తింపు లేదన్న మండలి
  • ఓ యువతి ఎంబీఏ అడ్మిషన్ నిరాకరణ
  • తాజా వ్యవహారంపై స్పందించిన గీతం సంస్థ

గీతం విశ్వవిద్యాలయం అందించే ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లవని నిన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. బీటెక్ కోర్సు నిర్వహించేందుకు గీతం వర్సిటీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా గీతం వర్సిటీలో చదివిన ఓ ఎంబీఏ విద్యార్థిని అడ్మిషన్ ను సైతం రద్దు చేసింది. తాజాగా ఈ నిర్ణయంపై గీతం వర్సిటీ యాజమాన్యం స్పందించింది.

తాము అందించే ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లుతాయని గీతం విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ తో పాటు మిగతా కోర్సులు అందించేందుకు తాము అనుమతులు తీసుకున్నామని స్పష్టం చేసింది. తమ బీటెక్ డిగ్రీలు చెల్లవని తెలంగాణ ఉన్నత విద్యామండలి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.

చట్టబద్ధమైన సంస్థల నుంచి అనుమతులు పొందాకే ఎవరైనా కోర్సులు, క్యాంపస్ ప్రారంభిస్తారని గుర్తుచేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, యూజీసీ, ఏఐసీటీఈ తనిఖీలు చేపట్టాకే తమ హైదరాబాద్ క్యాంపస్ కు అనుమతి ఇచ్చాయని గీతం యాజమాన్యం వెల్లడించింది.

  • Loading...

More Telugu News