KCR: ఫెడరల్‌ ఫ్రంట్‌ మాటలు ఎవరూ పట్టించుకోలేదన్న నిరాశతోనే కేసీఆర్‌ వ్యాఖ్యలు: ఏపీ మంత్రులు కొల్లు, అదినారాయణ

  • విశ్వసనీయతకు చంద్రబాబు మారుపేరు
  • రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం రుజువవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా పడతాయని భావించి 20 లక్షల ఓట్లను తొలగించి అక్రమంగా విజయాన్ని సొంతం చేసుకున్న తెరాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

గెలిచిన వెంటనే ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ విమానాల్లో చక్కర్లు కొట్టిన కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ అక్కసు చంద్రబాబుపై చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి భాషతో మాట్లాడడం సరికాదని విరుచుకుపడ్డారు. విశ్వసనీయతకు చంద్రబాబు మారుపేరని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంత విశ్వసనీయత ఉందో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రుజువుకానుందని, కేసీఆర్‌ జోస్యాలు చెప్సాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అఖండ మెజార్టీతో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

KCR
Kollu Ravindra
adinarayanareddy
  • Loading...

More Telugu News