Andhra Pradesh: వీడిన మిస్టరీ.. చిన్నారి వీరేశ్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడిన మహారాష్ట్ర పోలీసులు!

  • కిడ్నాపర్లను గుర్తుపట్టిన స్థానికులు
  • పోలీసులకు సమాచారం చేరవేత
  • ఏపీకి తీసుకువచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు

తిరుమలలో మహారాష్ట్రకు చెందిన వీరేశ్ అనే ఏడాదిన్నర చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున చిన్నారిని కిడ్నాప్ చేయగానే ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపును ముమ్మరం చేశారు. దీంతో అధికారుల ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. తాజాగా పిల్లాడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆచూకీ మహారాష్ట్రలో లభ్యమయింది.

మహారాష్ట్రలోని నాందేడ్ లో చిన్నారిని తీసుకెళుతున్న కిడ్నాపర్ ను వార్తల ద్వారా గుర్తుపట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కిడ్నాపర్ ను ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జాదవ్ తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిద్రిస్తున్న సందర్భంగా చిన్నారిని దుండగుడు కిడ్నాప్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News