Chandrababu: ఓటర్ కు, క్వార్టర్ కు తేడా తెలియని నువ్వా విమర్శించేది?: కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీడీపీ!

  • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు
  • కేసీఆర్ పోస్టర్లను చించి దహనం చేసిన కార్యకర్తలు
  • తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపిస్తూ, శనివారం రాత్రి విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్షణం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కార్యకర్తలు, కేసీఆర్ పోస్టర్లను ముక్కలు చేసి వాటిని దహనం చేశారు.

తమ సీఎంపై అవాకులూ, చవాకులు పేలితే అంతు చూస్తామని, ఓటర్ కు, క్వార్టర్ కు తేడా తెలియని కేసీఆర్ కు, తెలుగుజాతి స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబుపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు "ఖబడ్దార్ కేసీఆర్..." అంటూ విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదరు చేశారు.

Chandrababu
Quarter
KCR
Telugudesam
Vijayawada
  • Loading...

More Telugu News